హోమ్ / వంటకాలు / ఆలూ సమోసా

Photo of POTATO SAMOSA by Sridevi Vedantham at BetterButter
542
3
0.0(0)
0

ఆలూ సమోసా

Dec-07-2018
Sridevi Vedantham
30 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ సమోసా రెసిపీ గురించి

పిల్లలకి, పెద్దలకి, ఎంతో ఇష్టమైన మరియు అద్భుతమైన స్నాక్ ఆలూ సమోసా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా 250 గ్రాములు
  2. వెన్న - 50 గ్రాములు
  3. ఉప్పు తగినంత
  4. నీరు తగినంత
  5. నూనె 1/2 లీటరు
  6. బంగాళ దుంప 5
  7. క్యారట్ 1
  8. పచ్చి బటాణీ 100 gms
  9. స్వీట్ కార్న్ 100 gms
  10. టమాటో 4 నాటువి
  11. పచ్చి మిర్చి 1
  12. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం 1 టీ స్పూన్ చొప్పున
  13. గరం మసాలా 1 టీ స్పూన్
  14. పుదీనా - 1/4 కట్ట
  15. కొత్తిమీర - 1/4 కట్ట

సూచనలు

  1. ముందుగా మైదా లో వెన్న, ఉప్పు, తగినంత నీరు పోసి 30 నిమిషాల పాటు నాన పెట్టాలి.
  2. టమాటో, పచ్చి మిర్చి, కట్ చేసి పెట్టుకోవాలి
  3. బంగాళా దుంప, క్యారట్, పచ్చి బటాణీ, స్వీట్ కార్న్, అన్నీ తరిగి ఉడికించి, నీరు వడగట్టి పెట్టుకోవాలి.
  4. స్టవ్ ఫై పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి జీర వేసి, వరుసగా టమాటో, పచ్చి మిర్చి, వేసి వేయించి, ఉడికించి పెట్టుకున్న మిగిలిన కూరలన్ని వేసి ఉప్పు, కారం, జీర పొడి, ధనియాల పొడి, గరం మసాల, వేసి మూత పెట్టి వేయించాలి.
  5. ఇప్పుడు బాగు చేసి కడిగి తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసి 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  6. స్టవ్ పై మరొక పాన్ పెట్టి మొత్తం నూనె పోసి బాగా కాగ నివ్వాలి. గోధుమ పిండి ఓక స్పూన్ లో కొద్దిగ నీరు పోసి పల్చగా చేసి పెట్టుకోవాలి
  7. కలిపి ఉంచుకున్న పిండి ని ఉండలు చేసి చపాతీ లాగా వత్తుకొని సగానికి చాకు తో కట్ చేసి, ఒక సగం తీసుకుని కోన్ లాగ చేసి తయారు గ ఉన్న కూర నింపి అంచులు నీళ్ళతో పల్చగా కలిపిన గోధుమ పిండి రాసి సీల్ చెయ్యాలి
  8. 4,5 సమోసా చుట్టి రెడీ చేసి పెట్టాలి
  9. కాగిన నూనె లో రెడీ చేసి పెట్టుకున్న సమోసా లు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి, ప్లేట్ లోకి తీసుకుని టమాటో తొక్కు తీసి గులాబీ పువ్వు లాగ చేసి అలంకరించి, టమాటో సాస్ తో సర్వ్ చేసుకోవడమే :relaxed:️

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర