హోమ్ / వంటకాలు / ఫ్రూట్ క్రీమీ టార్ట్స్.

Photo of Fruit creamy tarts. by Swapna Tirumamidi at BetterButter
573
5
0.0(0)
0

ఫ్రూట్ క్రీమీ టార్ట్స్.

Mar-31-2019
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రూట్ క్రీమీ టార్ట్స్. రెసిపీ గురించి

ఇది చాలా చూడ్డానికి అమ్మో అనిపిస్తుంది కానీ చేయడం చాలాసులువే.ఉదయం,సాయంత్రం బ్రేక్ఫాస్ట్ లా, లేదా టీ కాఫీలతో పాటు తీసుకోవచ్చు.చేసినవెంటనే 15 . నిమిషాలలోపు తింటే కరకరలాడుతాయి బిస్కట్లు.క్రీము వాడుతున్నాం కాబట్టి ఎక్కువసేపు ఉంచితే మెత్తబడి పోతాయి కాబట్టి లంచ్ బాక్స్ ల్లో పెట్టడం వీలుకాదు.కానీ బిస్కట్లు ఎంచుకునేటప్పుడు కాస్త గట్టివి ఎంచుకుంటే వెంటనే మెత్తబడకుండా ఉంటాయి. పిల్ల పెద్ద అందరిని మెప్పించే ఐటమ్ ఇది.తప్పక ప్రయత్నించండి .మీకూ నచ్చుతాయి.దాల్చిన సువాసన,యాలకుల సుగంధం,మధ్యమధ్యలో పప్పు పలుకుల కమ్మదనం,తీపి,కేసరి ఇలా అన్ని రుచులతో కలగలిపిన ఓ మధురమైన రుచి కలుగుతుంది మనకు.ఇక్కడ నేను రక రకాల బిస్కట్లు తో చేసి చూపిస్తున్నాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. తాజా క్రీము/అముల్ క్రీము 120 గ్రాములు.
  2. పాలపొడి 3 చెంచాలు
  3. పంచదార పొడి 50 గ్రాములు(తీపి ఎక్కువకావాలి అంటే కొలత పెంచుకోవచ్చు)
  4. కుంకుమపువ్వు 4 రేకులు/ ఫ్లేవర్ రంగు చిటికెడు.
  5. దాల్చినచెక్కపొడి అర చెంచా
  6. తాజా యాలకులపొడి అరచెంచా
  7. బాదం,పిస్తా పలుకులు/పొడి 2చెంచాలు
  8. నచ్చిన పండ్ల ముక్కలు తగినన్ని(మామిడి,ద్రాక్ష,కివి,బ్లూ బెర్రీ,రాస్ బెర్రీ,దానిమ్మ నేను వాడినవి)
  9. క్రాకెర్స్ బిస్కట్లు 12(మీకు నచ్చినవి కూడా తీసుకోవచ్చు.)
  10. అధిక అలంకరణకు హెర్షేయ్స్ చాక్లెట్లే సిరప్ 3 చెంచాలు.
  11. మినీ ఓరియో బిస్కట్లు 6

సూచనలు

  1. ముందు ఒక గిన్నీలో క్రీమ్ మొత్తం వేసి అందులో పంచదార పొడి,పాలపొడి వేసి బాగా పేస్ట్ లా కలపాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 2 సమాన భాగాలుగా చేసి ఒక భాగాన్ని వేరే గిన్నీలోకి తీసుకోవాలి.
  2. ఇప్పుడు ఒక భాగంలో యాలకులపొడి,సాఫ్రాన్ పొడి(కుంకుమపువ్వు ని ఒక చెంచాడునీటిలో కలిపి కూడా వేయవచ్చు.నేను కలర్ వేసాను)వేసి బాగాకలిపి పెట్టుకోవాలి.
  3. రెండవ భాగంలో దాల్చినచెక్క పొడి,బాదం పిస్తా దంచినపొడి ఒకచెంచాడు వేసి కలిపి పెట్టుకోవాలి.
  4. ఇప్పుడు ఒకబిస్కట్ తీసుకుని దానిమీద దాల్చినచెక్క వేసిన క్రీము రాసి,దానిమీద ఇంకో బిస్కట్ పెట్టి దానిమీద యాలకులపొడి పొడి కలిపిన క్రీము రాసి ప్లేట్లో పెట్టుకోవాలి.ఇలాగే అన్ని బిస్కట్లు రెడీచేసి పెట్టుకోవాలి.
  5. ఇప్పుడు వాటిపై పండ్ల ముక్కలు పెట్టి చాక్లెట్ సిరప్ వేసి నట్స్ పొడి చల్లి పిల్లలకి అందిస్తే పళ్ళు,బిస్కట్లు తినని పిల్లలు ఇంకా ఇంకా ఆడిగిమరీ తింటారు.
  6. చివరిగా ఒక్కమాట.క్రేకేర్స్ లాంటి బిస్కట్లు వాడితే ఎక్కువసేపు కరకరలాడుతుంటాయి.ఏ బిస్కట్లు తీసుకున్నా తీపి లేనివి/తక్కువ ఉన్నవి తీసుకుంటే మనం చేసిన క్రీమ్ యొక్క రుచి బాగాతెలుస్తుంది.నేను వాడినవి ఈ క్రింద ఫొటోలో వివరంగావున్నాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర