హోమ్ / వంటకాలు / మేథి మట్టర్ మలై

Photo of Methi Matar Malai by Pravallika Srinivas at BetterButter
601
1
0.0(0)
0

మేథి మట్టర్ మలై

Oct-22-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేథి మట్టర్ మలై రెసిపీ గురించి

మేథి మట్టర్ మలై మేథి అంటే మెంతికూర మట్టర్ అంటే బఠాణీలు మలై అంటే మీగడ ఈ మూడితో తయారు చేస్తారు కాబట్టి మేథి మట్టర్ మలై అంటారు.మెంతికూర మధుమేహాన్ని కంట్రోల్ లో ఉంచుతుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • ఉత్తర భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. మెంతికూర - 1 కట్ట
  2. బఠాణీలు - 1 కప్పు
  3. పాల మీగడ లేదా ఫ్రెష్ క్రీం - తగినంత
  4. జీడిపప్పు - 10
  5. ఉల్లిపాయ - 1
  6. అల్లం - 1 అంగుళం ముక్క
  7. వెల్లులిరెబ్బలు - 2
  8. నూనె - తగినంత
  9. బిర్యానీ ఆకు - 2
  10. పట్టా - 1 అంగుళం ముక్క
  11. లవంగం - 4
  12. పాలు - తగినంత
  13. పుట్నాల పొడి - 1 టేబుల్ స్పూన్
  14. ఉప్పు - తగినంత
  15. ఇలాచీ - 4
  16. మిర్యాల పొడి - 1/4 చెంచా
  17. కొతిమీర - 3 రెమ్మలు

సూచనలు

  1. ముందుగా మెంతికూర కడిగి పెట్టుకోవాలి.
  2. మెంతికూర ని నీటిలో ఉడికించి వడగట్టుకోవాలి.
  3. జీడిపప్పుని నీటిలో నానపెట్టాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో ఉల్లిపాయ, అల్లం, వెల్లులిరెబ్బలు ,జీడిపప్పు వేసి పేస్ట్ లాగ రుబ్బుకోవాలి.
  4. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేసి బిర్యానీ ఆకు ,పట్టా ,లవంగం, ఇలాచీ వేసి రుబ్బుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
  5. పాలు ,మెంతికూర ,బఠాణీలు, పుట్నాల పొడి ఉప్పు వేసి కలుపుకోవాలి.
  6. కొంచం ఉడికిన తర్వాత పాల మీగడ లేదా ఫ్రెష్ క్రీం వేసి దగ్గరపడేవరకు ఉడికించుకోవాలి.
  7. కొంచెం మిర్యాల పొడి ,కొతిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  8. అంతే రుచికరమైన మేథి మట్టర్ మలై రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర