హోమ్ / వంటకాలు / బీట్రూట్ పచ్చడి

Photo of BEETROOT pickle  by Kavitha Perumareddy at BetterButter
336
1
0.0(0)
0

బీట్రూట్ పచ్చడి

Sep-25-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీట్రూట్ పచ్చడి రెసిపీ గురించి

బీట్రూట్ తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పర్సెంట్ పెరుగుతుంది.విటమిన్ ఎ కూడా శరీరానికి అందుతుంది.పీచు పదార్థం కాబట్టి మంచిగా జీర్ణశక్తి ని పెంచుతుంది. బీట్రూట్ ఎక్కువగా తినడం కూడా మంచిది కాదు కిడ్నీలు దెబ్బ తింటాయి.రక్తంలో ఎరుపుదనం పెరుగుతుంది అదికూడా మంచిదికాదు.ఏదయినా లిమిట్ లో తింటేనే మంచిది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. బీట్రూట్ ఒక గడ్డ పెద్దది
  2. పచ్చిమిర్చి 15
  3. జీలకర్ర స్పున్
  4. ధనియాలు స్పున్
  5. నూనె 3 స్పూన్స్
  6. ఉప్పు తగినంత
  7. పోపుగింజలు స్పున్
  8. కరివేపాకు కొద్దిగా
  9. వెల్లుల్లి 6 రెబ్బలు
  10. ఎండుమిర్చి 2
  11. చింతపండు కొద్దిగా ఉసిరికాయ అంత

సూచనలు

  1. ముందుగా బీట్రూట్, పచ్చిమిర్చి, తరిగి పెట్టుకోవాలి .చింతపండు కొద్దిగా నీరు పోసి నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి జీలకర్ర, ధనియాలు వేసి వేగిన తరువాత బీట్రూట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి 10 నిముసాలు మగ్గించుకోవాలి.
  3. తరువాత రోటిలో బీట్రూట్ మిశ్రమాన్ని, తగినంత ఉప్పు వేసి దంచుకోవాలి. తరువాత నానబెట్టిన చింతపండు వేసి అంతా కలిసేలా బాగా దంచుకోవాలి. నీళ్లు వేసుకోకూడదు. మిక్షిలో ఐనా రుబ్బుకోవచ్చు.
  4. తరువాత పోయిమీద బాండీ పెట్టి స్పున్ నూనె వేసి పోపుగింజెలు,వెల్లుల్లి, కరివేపాకు ,ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోని పచ్చడికి కలపాలి అంతే బీట్రూట్ పచ్చడి రెడీ ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర